'అల్లం వెల్లుల్లి'కి గ్రాఫిక్స్
తెలుగు తెరపై ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని హోటల్ మేనేజిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'అల్లం వెల్లుల్లి'. పి.వి.ఆర్.క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ పల్ల దర్శకుడు. అరుణ్, శ్రీకర్ హీరోలుగా, రాణి, సింధు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ హైలైట్ గా నిలువనున్నాయి.
చిత్ర విశేషాలను కిరణ్ పల్ల తెలియజేస్తూ, రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయిందనీ, ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోందనీ అన్నారు. బ్యాలెన్స్ పాటలను ఇదే నెలలో చిత్రీకరించి, వచ్చే నెలలో సినిమా విడుదల చేస్తామని అన్నారు. ముక్కోణపు ప్రేమకథగా సాగే ఈ చిత్రంలో కథకు అనుగుణంగా వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయనీ, 20 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ అవుతాయని అన్నారు. గ్రాఫిక్స్ విషయంలో విదేశీ నిపుణుల సహకారం కూడా తీసుకున్నట్టు చెప్పారు. ఇందులోని 7 పాటలకు సిగ్ధ వీనులవిందైన సంగీతం అందించారనీ, పాటలన్నీ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటాయని చెప్పారు. నటీనటులు కొత్తవారైనా కథానుగుణంగా ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీ ఫిల్మ్ గా సినిమా తీశామని చెప్పారు. మాస్టర్ భరత్, ధర్మవరపు, కృష్ణభగవాన్ లపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, మేల్కొటె, సమీర్, సన, సురేఖావాణి తదితరులు నటించారు. కిరణ్ పల్ల కథ-స్క్రీన్ ప్లే సైతం అందించగా, బండి సత్యం-అవినాష్ పాటలు, క్రిష్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|