నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అయిన మీ శ్రేయోభిలాషి. ఉత్తమ చిత్రంగా ఎంపికై ఎన్నో అవార్డులను అందుకున్న ఈ చిత్రం ఫిలిం హెబిటాట్ ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైంది. సి.సి.రెడ్డి సమర్పణలో డా.వై..సోనియారెడ్డి నిర్మించిన మీ శ్రేయోభిలాషి చిత్రం న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా జరగబోయే ఉత్సవంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏకైక చిత్రంగా ప్రదర్శించబడుతోంది. ఫెస్టివల్ ప్రారంభం రోజైన 8 తేదీన స్లమ్ డాగ్ మిలియనీర్స్ తర్వాత రెండవ ప్రదర్శనగా మీ శ్రేయోభిషిని ఎంపిక చేశారు. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విడుదలైన ఏడాదిన్నర తర్వాత కూడా దర్శక, నిర్మాతలకు మిగతా యూనిట్ కు గౌరవం తెచ్చి పెట్టిపెడుతున్న చిత్రమిదని తెలిపారు. ఈ సినిమాకు దర్శకుడినైనందుకు ఎనలేని సంతోషంగా ఉందన్నారు. హెబిటాట్ వారి ఆహ్వానం మేరకు 8వ తేదీ నుంచి 17వ తేదీవరకు జరిగే ఫిలిం ఫెస్టివల్ కు వెళుతున్నందుకు ఆనందాన్ని వెలిబుచ్చారు