ఎన్టీఆర్ అమెరికా ట్రిప్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాగ్దాటి, తెలుగుదేశం పార్టీని ఆయన భుజాన వేసుకుని చేసిన ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం రేపితే, ఎన్టీఆర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు యంగ్ స్టార్స్ కూడా ప్రచార తెరపైకి రాక తప్పలేదు. ఎన్టీఆర్ ప్రచారం ప్రభావం ఏమేరకు పనిచేసిందనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతుంది. ఎన్టీఆర్ సైతం రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయాల నుంచి దాదాపు కోలుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల ఇచ్చిన విందు పార్టీలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఎక్కవ సేపు కూర్చోవడం, నడవడం వంటివి చేయగలుగుతున్న ఎన్టీఆర్ అతి త్వరలోనే మళ్లీ ముఖానికి మేకప్ కూడా వేసుకోబోతున్నారు. గాయాల కారణంగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'అదుర్స్ ' సినిమా షూటింగ్ ఆగిపోయింది. సాధ్యమైనంత త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలని వినాయక్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అమెరికా ట్రిప్ కోసం ఎన్టీఆర్ ప్లాన్ చేశారనీ, అక్కడ్నించి తిరిగి రాగానే 'అదుర్స్' షూటింగ్ లో పాల్గొంటారనీ తెలిసింది. ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన అమెరికా పర్యటనకు వెళ్తారనీ, 20 రోజుల ట్రిప్ అనంతరం ఆయన తిరిగి వస్తారనీ తెలుస్తోంది. పనిలో పనిగా అక్కడి తన వీపుకు తగిలిన గాయం గురించి వైద్యుల సలహాలు తీసుకుంటారనీ, మునుపటిలా స్పీడ్ డాన్సులు, ఫైట్స్ ల వల్ల గాయం తిరిగపెట్టే అవకాశాల గురించి కూడా విపులంగా తెలుసుకుంటారనీ చెబుతున్నారు. 'అదుర్స్' చిత్రం పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ పై ఓ కొత్త చిత్రానికి కూడా ఎన్టీఆర్ కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|