'ఎవరైనా ఎపుడైనా' ఆడియో
హ్యాపీడేస్', 'కొత్తబంగారులోకం' వంటి రెండు వరుస హిట్లు సాధించిన వరుణ్ సందేష్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. వరుణ్ సందష్, విమలారామన్ జంటగా ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ఎవరైనా ఎపుడైనా'. దీనికి 'ప్రేమలో పడొచ్చు' అనే ట్యాగ్ లైన్ ఉంది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు మార్తాండ్ కె.శంకర్ తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈనెల 14న ఈ చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, సరైన సమయంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత శరవణన్ తెలిపారు. ఎవిఎం సంస్థ 'శివాజీ' వంటి పెద్ద చిత్రాలు నిర్మిస్తూనే చిన్న చిత్రాలకు కూడా ముందుకు రావడం ఆహ్వానించదగిన పరిణామమనీ, నిర్మాతలు తనపై ఉంచి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారనీ, శక్తివంచన లేకుండా మంచి రిజల్ట్ రాబట్టేందుకు ప్రయత్నించాననీ మార్తాండ్ కె.శంకర్ తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆడియో విడుదల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవియం సంస్థ 'వీడొక్కడే' చిత్రాన్ని ఇటీవల విడుదల చేయగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దక్కుబాటి రాణాను పరిచయం చేస్తూ 'లీడర్' అనే చిత్రం కూడా ఇదే బ్యానర్ లో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. జూన్ లో 'ఎవరైనా ఎపుడైనా', జూలైలో 'లీడర్' విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|