3డి యానిమేషన్ 'శ్రీ బాలాజీ'
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిపై తెలుగులో తొలిసారిగా రూపొందుతున్న పూర్తి స్థాయి 3డి యానిమేషన్ చిత్రం 'శ్రీ బాలాజీ'. అక్కినేని వినయ్ దర్శకత్వ పర్వవేక్షణలో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ అన్నమాచార్య 601వ జయంత్యుత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న లక్ష గళ సంకీర్తన కార్యక్రమంలో ఈ చిత్రం ఆడియో సీడీని విడుదల చేస్తున్న్టటు అక్కినేని వినయ్ తెలియజేశారు.
రెండు గంటల పది నిమిషాల నిడివి గల ఈ 'శ్రీ బాలాజీ' చిత్రానికి 250 మంది సాంకేతిక నిపుణులు 6 నెలల పాటు శ్రమించారనీ, త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ అన్నారు. లక్షలాది మంది బాలాజీ భక్తుల సమక్షంలో ఆడియో సీడీ విడుదల చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి వేటూరి గీత రచన, కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతం అందించారని తెలిపారు.
Be first to comment on this News / Article!
|