ఆర్.కె. మీడియా ప్రమోషన్
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆర్.కె.మీడియా అనే సంస్థ ఏర్పడింది. సీనియర్ పాత్రికేయుడు రవికుమార్ పనస ఆర్.కె.మీడియాను స్థాపించారు. బాలీవుడ్ కు చెందిన ఎస్-5 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు రవికుమార్ తెలియజేశారు.
ప్రసాద్ ల్యాబ్ లో ఆ వివరాలను ఆయన తెలియజేస్తూ, బాలీవుడ్ లో మీడియా ప్రమోషన్ వర్క్ లో మంచి పేరున్న ఎస్ -5తో కలిసి పనిచేస్తుండటం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఎస్-5 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సనీ మాట్లాడుతూ, తమ సంస్థ బాలీవుడ్ లో వందకు పైగా సినిమాలను ప్రమోట్ చేసిందనీ, దక్షిణాదిన ఆర్.కె.మీడియాతో కలిసి తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రమోట్ చేయబోతున్నామనీ చెప్పారు. చిన్న సినిమాలకు ఆర్.కె.మీడియో ప్రమోషన్ వల్ల మేలు జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. శర్వానంద్, నిఖిల్, వెంకీ, మధుర శ్రీధర్, చంద్రమహేష్, ఎన్.శంకర్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|