'ఊహాచిత్రం' తొలికాపీ సిద్ధం
'నగరం', 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రాలతో గ్లామర్ కథానాయికగా పేరు తెచ్చుకున్న కావేరీ ఝా తాజా సినిమా 'ఊహాచిత్రం'. తొలి రెండు చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఈ చిత్రంతో తనకు తెలులో మంచి బ్రేక్ వస్తుందనే ఆశతో కావేరీ ఝా ఉంది. నగర నేపథ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు సత్య తెరకెక్కించారు. లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై కె.పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది.
ఈ చిత్రం ఆడియో ఇప్పటికే శ్రోతలను బాగా ఆకట్టుకుంటోందనీ, ఇదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ పైడిబాబు తెలిపారు. ఈ చిత్రం కోసం వైజాగ్ లో ఒక పాట, అరకులో మరో పాట, అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన భారీ సెట్ లో మరో పాట చిత్రీకరించామని చెప్పారు. ఇందులో వంశీ కృష్ణ సోలో హీరోగా నటించాడనీ, నటన, డాన్స్, పైట్స్ లో చక్కటి ప్రతిభ కనబరచారనీ చెప్పారు. అలాగే కావేరీ ఝాకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందన్నారు. ఈ చిత్రంలోని ఇత పాత్రల్లో జీవా, సూర్య, బబ్లు, శ్రీధర్, విజయ్ , సుధీర్, ఢిల్లీ రాజశ్వరి నటించారు. సురేంద్ర కృష్ణ మాటలు, వి.ఎన్.సురేష్ కుమార్ సినిమాటోగ్రఫీ, శివ ఆర్ నందిగామ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|