తిరిగొచ్చిన దేవ్ కట్టా
ఎన్.ఆర్.ఐ. దర్శకుడు దేవ్ కట్టా మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఓ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రంగా రాజా, పార్వతి మిల్టన్ జంటగా 'వెన్నెల' వంటి ఫీల్ గుడ్ మూవీని ఆయన ప్రేక్షకులకు అందించారు. కమర్షియల్ గా కూడా ఈ చిత్రానికి మంచి పేరు వచ్చింది. కథానుసారం ఆ చిత్రంలో ఎక్కువ భాగం అమెరికాలో నే షూట్ చేశారు. తాజాగా ఆయన మరో వైవిధ్యమైన కథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అయితే ఈసారి ఇండియన్ సబర్బన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నారు.
తొలి చిత్రంలో పార్వతి మిల్టన్ ను ప్రేక్షకులకు పరిచయం చేసినట్టే మలి చిత్రంలోనూ ఒక ఎన్.ఆర్.ఐ. అమ్మాయిని ప్రేక్షకులకు ఆయన పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. 'వెన్నెల' చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన మహేష్ శంకర్ ను తన తాజా చిత్రానికి సైతం సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. త్వరలోనే నటీనటుల, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను దేవ్ కట్టా ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|