నాని-మాధవి 'స్నేహితుడా'
'అష్టాచమ్మ' చిత్రంతో హీరోగా రాణించిన నాని, 'నచ్చావులే' చిత్రంతో కథానాయికగా తొలి సక్సెస్ సాధించిన మాధవీలత జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి 'స్నేహితుడా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. జెమినీ ఫిలిమ్ సర్క్యూట్స్ సమర్పణలో సత్యం ఎంటర్ టైనర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యం బెల్లంకొండ దర్శకత్వం వహిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నప్పటికీ చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఇందులో ఉంటుందని దర్శకుడు సత్యం బెల్లంకొండ చెబుతున్నారు. హీరో తండ్రి పాత్ర (నాజర్) కు మంచి ప్రాధాన్యం ఉండబోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెల మూడోవారంలో ఆడియో, జూన్ లో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, సుత్తివేలు, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. భాషా శ్రీ మాటలు-పాటలు అందిస్తుండగా, వాసు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, శివ శంకర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|