'రాజాధిరాజా' ఆడియో
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు లారెన్స్ కథానాయకుడుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'రాజాధిరాజా'. కామ్న జెఠ్మలానీ, స్నిగ్ధ, మీనాక్షి, ముంతాజ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. డాక్టర్ వి.నాగేశ్వరరెడ్డి సమర్పణలో ఎన్.రామిరెడ్డి, డాక్టర్ శరత్ చంద్రారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తి చిదంబరం దర్శకుడు. ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలోని ఆంధ్రా సోషల్ కల్చరల్ అసోసియేషన్ (ఆంధ్రా క్లబ్ లో) జరిగింది. ఆడియో సీడీని లారెన్స్ ఆవిష్కరించి తొలి ప్రతిని ముంతాజ్ కూ, రెండవ సీడీని శక్తిచిందంబరానికి అందజేశారు. కరుణాస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.
ఈ చిత్రంలో లారెన్స్ వైవిధ్య భరితమైన నటన ప్రదర్శించారనీ, ముంతాజ్ విలనీ సినిమాకే ఓ హైలైట్ అవుతుందని నిర్మాతలు తెలిపారు. ఐదు పాటలున్న ఆడియోతో పాటు, సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తమకుందని అన్నారు. లారెన్స్ మాట్లాడుతూ, తనకు చాలాకాలంగా శక్తిచిదంబరం తెలుసనీ, చాలా కష్టపడి ఈ చిత్రాన్ని మలిచారనీ చెప్పారు. ముఖ్యంగా ఆయన వర్కింగ్ స్టయిల్, పాటల చిత్రీకరణ చాలా బాగుందనీ, ముంతాజ్ తనతో పోటీపడి నటించిందనీ అన్నారు. ఇప్పటివరకూ నటిగా, డాన్సర్ గా అందిరికీ తెలిసిన తాను ఈ చిత్రంలో విలన్ గా విభిన్నమైన పాత్రను పోషించినట్టు ముంతాజ్ తెలిపారు. దర్శకుడు తన పాత్రను చక్కగా తెరకెక్కించారనీ, తాను కోరుకున్న పాత్ర దక్కడం సంతోషంగా ఉందనీ చెప్పారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, భువనచంద్ర-వెన్నెలకంటి మాటలు, కణల్ కన్నన్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|