మనోజ్ పాటల 'ప్రయాణం'
మంచు మనోజ్ కుమార్ కథానాయకుడుగా చంద్రశేఖర్ ఏలేటి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రయాణం'. ఈ సినిమా పాటలు రేడియో మిర్చి ద్వారా సోమవారంనాడు మార్కెట్లోకి ప్రయాణమయ్యాయి. సికింద్రాబాద్ లోని రేడియో మిర్చి కార్యక్రమంలో మనోజ్ శ్రోతలతో మాట్లాడుతూ పాటలను విడుదల చేశారు.
మనోజ్ మాట్లాడుతూ, తాను నటించిన 'నేను మీకు తెలుసా' పాటలు కూడా ఇలాగే మిర్చి ద్వారా విడుదలై హిట్ అయ్యాయనీ, 'ప్రయాణం' పాటలు కూడా అలాగే అవుతాయని అనుకుంటున్నాననీ చెప్పారు. 'రాగ డాట్ కామ్', 'ప్రయాణం డాట్ కామ్'లలో ఈ పాటలను వినవచ్చనీ, డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చనీ తెలిపారు. ఇందులో రెండు పాటలు అద్భుతంగా వచ్చాయనీ, మహేష్ శంకర్ చాలా మంచి సంగీతం అందించారనీ చెప్పారు. రెండు గంటల పాటు ఎయిర్ పోర్ట్ లో జరిగే సంఘటనతో కథ ఫినిష్ కావాలనీ, దర్శకుడు ఈ కాన్సెప్ట్ ను చాలా కొత్తగా, అద్భుతంగా తెరకెక్కించారనీ చెప్పారు. వేసవి సెలవుల కానుకగా ఈ చిత్రం విడుదలవుతుందని అన్నారు. మహేష్ శంకర్ మాట్లాడుతూ, అహ్లాదకరమైన కథ, యునీక్ కాన్సెప్ట్, రీరికార్డింగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పారు. ఇందులో హైపర్ యాక్టివ్ గా ఉండే హీరో అమ్మాయి ప్రేమ కోసం సాఫ్ట్ గా తయారుకావడం, మళ్లీ తన యాక్టివ్ నెస్ లోకి వెళ్లిపోవడం ఆసక్తికరంగా ఉంటాయనీ, ఈ పాత్రలో మనోజ్ కుమార్ అద్భుతంగా నటించాడనీ చెప్పారు. బ్రహ్మానందం కామెడీ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. హారిక హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|