నితిన్ 'మిర్చి' జూలైలో
నితిన్, ఇలియానా తొలిసారి జంటగా శ్రీ స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ నిర్మిస్తున్న చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రానికి 'మిర్చి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్లైమాక్స్, మూడు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయిందనీ, జూలైలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత తెలిపారు.
ఈ చిత్రం ప్రోగ్రస్ ను తెలియజేస్తూ, నితిన్, ఇలియానా జంట ఈ చిత్రంలో కన్నులపండువగా ఉంటుందనీ, నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ జి.వి.రమణ తెలిపారు. ఇటీవల దుబాయ్, మస్కట్, ఒమన్ లలో 35 రోజుల పాటు భారీ షెడ్యూల్ జరిపామనీ,
రెండు పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ ను అక్కడ తీశామనీ చెప్పారు. ఈనెల 4 నుంచి 6 వరకూ హైద్రాబాద్ లోని ఫతేనగర్ లో ఓ ఫైట్, మరో ఛేజింగ్ సన్నివేశాలు తీశామనీ, నితిన్, భానుచందర్, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ తదితరులపై 7 నుంచి 9 వరకూ రామోజీ ఫిలింసిటీలో జైలు ఎపిసోడ్ కు చెందిన సన్నివేశాలు తీశామనీ చెప్పారు. జూన్ లో ఆడియో, జూలైలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి రమేష్-గోపి మాటలు, టి.సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|