మెస్మరైజ్ చేసే 'మల్లన్న'
గ్రామాల దత్తత
'మల్లన్న'లో ఆర్థిక అసమానతలు చర్చించిన తరహాలోనే ఒక మంచి కార్యక్రమానికి నిర్మాత థాను శ్రీకారం చుట్టారని సుశీ గణేషన్ తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో కందస్వామి ఫౌండేషన్ స్థాపించి అక్కడి గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సినిమా ప్రారంభించిన మొదట్లో రెండు గ్రామాలు దత్తత తీసుకుని సినిమా పూర్తయ్యేనాటికి 30 గ్రామాలకు విస్తరించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్లన్న ఫౌండేషన్ స్థాపించి కొన్ని గ్రామాలు దత్తత తీసుకోనున్నట్టు వెల్లడించారు.
దేవీశ్ర్రీప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా వివిధ కోణాల్లో కొత్తరకమైన సంగీతాన్ని అందించేందుకు అవకాశం కలిగిందనీ, ఇందులో మొత్తం 6 పాటలు ఉన్నాయని చెప్పారు. ఒకటి ఐటెం సాంగ్, మరొకటి హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ కాగా, విక్రమ్ కు సంబంధించిన మిగతా నాలుగు పాటలకూ ఆయనే నేపథ్యగానం అందించడం విశేషమని అన్నారు. రెండు భాషల్లోనూ విక్రమ్ ఈ పాటలు పాడటం ఒక రికార్డని అన్నారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుందని చెప్పారు. 'అపరిచితుడు'గా పాపులర్ అయిన విక్రమ్ ఇకపైన 'మల్లన్న'గా పాపులర్ కావడం ఖాయమని సి.కల్యాణ్ జోస్యం చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|