'జల్సా' కంటే 'బిల్లా' మిన్న!
పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా సూపర్ సక్సెస్ అయిన 'జల్సా' చిత్రానికీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా యావరేజ్ రేంజ్ సినిమా అనిపించుకున్న 'బిల్లా' చిత్రానికీ పోలిక ఏమిటంటారా? నిశ్చయంగా లేదు. 'జల్సా' 40 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ సినిమాల్లోనే సరికొత్త రికార్డు సృష్టిస్తే అందులో సగం గంటే తక్కువ షేర్ మాత్రమే 'బిల్లా' ఇంతవరకూ రాబట్టింది. ఈ పోలిక ఎందుకొచ్చిందంటే... హోటల్ తాజ్ లో జరిగిన 'బిల్లా' ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలో పాల్గొన్న వి.వి.వినాయక్ ఆ చిత్రానికి ఎగ్జిబిటర్ గా కూడా తన సొంత థియేటర్లో విడుల చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పోలిక తెచ్చారు.
వినాయక్ థియేటర్ లో 'జల్సా' చిత్రానికి మొదటి వారంలో లక్ష రూపాయలు షేర్ వచ్చిందట. 'బిల్లా ' ఈ రికార్డును అధిగమిస్తూ తొలివారంలో మరో 15 వేలు అదనంగా అంటే 1.15 లక్షలు వసూలు చేసింది. ఇంత మంచి విజయాన్ని సాధించిన హీరో ప్రభాస్ నూ, దర్శకనిర్మాతలనూ వినాయక్ అభినందించారు. పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత గోపీకృష్ణ మూవీస్ పతాకంపై తాను నిర్మించిన చిత్రానికి ఊహించని బిజినెస్ జరిగిందనీ, 3 వారాల్లో 16.5 కోట్ల షేర్ వసూలు చేయడంతో ఎగ్జిబిటర్లంతా హ్యాపీగా ఉన్నారనీ చిత్ర నిర్మాత యు.కృష్ణంరాజు సైతం సంతోషం వ్యక్తం చేసింది. సో...'జల్సా' ఫైనల్ రికార్డును అధిగమించడానికి 'బిల్లా' లాంగ్ మార్చ్ చేయాల్సిందే.
Be first to comment on this News / Article!
|