నమిత నాలుగేళ్ల నిరీక్షణ
అందచందాలతో పాటు ఆహార్యం కూడా తోడైతే ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ కు కొదవుండదు. అలాంటి ఇమేజ్ నమిత సొంతం. తెలుగులో అంతగా రాణించలేకపోయినా తమిళనాట నమితకు పెద్దఎత్తున అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆమెకో గుడి కూడా కట్టించేశారు. తెలుగులోనూ ఇప్పుడు నమితకు క్రేజ్ మొదలైంది. 'బిల్లా' చిత్రంలో అనుష్కతో పోటీపడి వైట్ బికినీలో అందాలు ఆరబోసిన నమిత ఇప్పుడు 'జగన్మోహిని' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. సోలో హీరోయిన్ గా 'దేశద్రోహి' చిత్రంలో పోలీస్ గెటప్ లో అలరించబోతోంది. త్వరలోనే తెలుగునాట కూడా తనపేరుతో గుడి వెలుస్తుందనే ధీమాతో ఉంది. ఇంత బిజీలోనూ గత ఆదివారంనాడు నమిత ముంబైలోని తన కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకను ఎంతో సంబరంగా జరుపుకొంది. ఇందులో విశేషం ఏమిటంటే నాలుగేళ్ల తర్వాత తన బర్త్ డే వేడుకను ఇంట్లో జరుపుకోవడం.
'కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మా తాతగారి సమక్షంలో బర్త్ డే జరుపుకోవడమంటే నాకెంతో ఇష్టం. అయితే 2005 నుంచి నాకున్న బిజీ వల్ల అది సాధ్యం కాలేదు. సినిమా లొకేషన్లు, యూనిట్ సభ్యుల మధ్య నాలుగేళ్లుగా నా పుట్టినరోజు జరుగుతోంది. ఇప్పటికి మళ్లీ నా వాళ్ల మధ్య బర్త్ డే జరుపుకోవడం హ్యపీగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది నమిత. నమిత సంబరం ఇలా ఉంటే ఆమె పుట్టినరోజును నమిత ఫ్యాన్ క్లబ్ సభ్యులు చెన్నైలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జరుపుకొన్నారు. అనాథ పిల్లలకు ఉచిత భోజనాలు ఎరేంజ్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. కోయంబత్తూరులోని నమిత ఫ్యాన్ క్లబ్ వారు ఇప్పటికే ఆమె పేరిట 'నమిత ఈవినింగ్ ట్యూషన్ సెంటర్' అనే ఉచిత విద్యాబోధనా విభాగం ఏర్పాటు చేశారు. అందులోని విద్యార్థులకు నమిత ఫ్యాన్ క్లబ్ వారు గత వారంలో మూడు కంపూటర్లు, స్కూలు బుక్స్, స్టేషనరీ పంచిపెట్టారు. ఓ సినిమా షూటింగ్ కోసం కోయంబత్తూరులోనే ఉన్న నమిత నేరుగా చిన్నారులను కలుసుకుని వారితో కొద్దిసేపు గడిపారు.
Be first to comment on this News / Article!
|