గోపీకృష్ణ మూవీస్ కొత్తచిత్రం
గోపీకృష్ణ మూవీస్ పతాకంపై మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ సంస్థ అధినేత రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రకటించారు. గతంలో 'కృష్ణవేణి', 'అమరదీపం', 'భక్తకన్నప్ప' ఎంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ అందించింది. గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ తాజా చిత్రం 'బిల్లా' విజయవంతగా ప్రదర్శితమవుతోంది. మంగళవారంనాడు ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకలో భాగంగా కృష్ణంరాజు తమ సంస్థ తదుపరి చిత్రాన్ని వెల్లడించారు.
పదిహేనేళ్ల గ్యాప్ అనంతరం 'బిల్లా' చిత్రంతో మళ్లీ గోపీకృష్ణ బ్యానర్ పై సినిమాలు తీసేందుకు నిర్ణయించుకున్నామనీ, ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించడం ఎంతో సంతోషంగా ఉందనీ అన్నారు. అయితే గోపీకృష్ణ మూవీస్ గత చిత్రాలతో పోల్చుకుంటే 'బిల్లా' చిత్రంలో మరికొంత సెంటిమెంట్ ఉంటే బాగుండేదని అనిపించిందనీ, ఆ కొరత తమ తదుపరి చిత్రంలో తీరుస్తామని చెప్పారు. మహిళలతో పాటు అందరినీ ఆకట్టుకునే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. దీనిపై మరిన్ని వివరాలను ఆయన త్వరలోనే ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|