'అదే నువ్వు - అదే నేను'
శశాంక్, ఆర్య మీనన్ (చక్ దే ఇండియా ఫేమ్) జంటగా మెషక్ మూవీ మూకర్స్ పతాకంపై జాన్ బాప్టిస్ట్ నిర్మిస్తున్న చిత్రం 'అదే నువ్వు-అదే నేను'. శ్రీనివాస్ బల్లా దర్శకుడు. ఈ చిత్రం ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిటిఎస్ మిక్సింగ్ జరుపుకొంటోంది. జూన్ ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
శ్రీనివాస్ బల్లా మాట్లాడుతూ, లవబుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ, స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే చిత్రమిదనీ చెప్పారు. నిర్మాత బాపిస్ట్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. మలేసియా, రామచంద్రాపురం, హైద్రాబాద్ పరిసారాల్లో టాకీ పార్ట్ జరిపామనీ, 3 పాటలు మలేసియాలో చిత్రీకరించామని అన్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతో చక్కటి సహకారాన్ని అందించారని చెప్పారు. మోహన్ సితార సంగీత అందించిన 5 పాటలు వేటికటే ప్రత్యేకంగా ఉంటాయనీ, వేల్ రికార్డ్స్ ద్వారా ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తోందనీ అన్నారు. ఈ చిత్రంతో హీరో శశాంక్ కు మంచి బ్రేక్ వస్తుందనీ, ఆర్యమీనన్ కు తెలుగులోనూ మంచి గుర్తింపు వస్తుందన్నారు. సత్యం రాజేష్, ఏవీయస్, దువ్వాసి, మేల్కొటి చేసిన కామెడీ ఈ చిత్రానికి మరో హైలైట్ అవుతుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గాయత్రి, నరహ, రంగనాథ్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. రషీద్ మొపెన్ సంగీతం, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|