శ్రియతో ప్రేమా? అంతా ట్రాష్!
తెలుగు కుర్రాడైనా తమిళంలో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవుతున్న విశాల్ ('పందెంకోడి', 'పొగరు' ఫేమ్) తరచు తన చిత్ర కథానాయికలతో ప్రేమలో పడినట్టు వదంతులు ఎదుర్కొంటున్నారు. ఆయన ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. అందాల నటి శ్రియతో విశాల్ ప్రస్తుతం ప్రేమాయణం నడుపుతున్నారనీ, 'పిస్తా' చిత్రం షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్యా ఈ అనుబంధం మరింత బలపడిందనీ కొద్దిరోజులుగా వదంతలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం వదంతులలేననీ, వీటిలో ఎంతమాత్రం నిజం లేదనీ విశాల్ తాజాగా వివరణ ఇచ్చారు.
శ్రియ తనకు మంచి ఫ్రెండ్ అనడంలో సందేహం లేదనీ, అంతకు మించి తమ మధ్య ఇంకెలాంటి అనుబంధం లేదనీ విశాల్ తెలిపారు. ఇదే సమయంలో 'తిమురు' (తెలుగులో 'పొగరు') చిత్ర దర్శకుడు తరుణ్ గోపి తనపై చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనందుకు తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదంటూ తరుణ్ గోపి ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో విశాల్ నూ, క్షమశిక్షణ లేని నటుడంటూ హీరో శింబునూ ఆయన విమర్శించారు. దీనిపై విశాల్ స్పందిస్తూ, ఆ సినిమాకి తాను నిర్మాతను కాననీ, కనీసం ఫైనాన్షియర్ ని కూడా కాదనీ అన్నారు. 'తిమురు' విడుదలకు ముందే ఈ విషయాన్ని తరుణ్ గోపి చెప్పి ఉండవచ్చనీ, అలా చేయకుండా సినిమా విడుదలైన ఇంతకాలం తర్వాత మాట్లాడటంలో అర్ధం లేదనీ స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|