ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ చిత్రం
ఇంద్ర, బిందు, గీతాంజలి హీరోహీరోయిన్లుగా పాన్ అమెరికా సమర్పణలో ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్ పై ఓ కొత్త చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో గురువారంనాడు ప్రారంభమైంది. హీరో ఇంద్ర ఈ చిత్రానికి నిర్మాత. శ్రావణ్ బాపట్ల దర్శకత్వం వహిస్తున్నారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ ఇవ్వగా, గాదె రాజశాఖర్ కమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సత్య ('ఊహాచిత్రం' ఫేమ్) గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు శ్రావణ్ బాపట్ల మాట్లాడుతూ, ఈ చిత్రానికి కథే హీరో అనీ, లవ్, సస్పన్స్ వంటి అంశాంలతో ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. ఇంద్ర మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన 'కుర్ కురే' చిత్రంలో తాను నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారనీ, ఈ కథ తనకు బాగా నచ్చడంలో సొంతంగా నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. నటుడిగా ఇంతవరకూ 25 సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినట్టు తెలిపారు. మంచి కథాంశంతో పాటు ఇందులో చక్కటి సందేశం కూడా ఉందనీ, దర్శక నిర్మాతలకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాననీ సీనియర్ నటి కవిత అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని హీరోయిన్లు బిందు, గీతాంజలి పేర్కొన్నార. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జీవా, ఎం.ఎస్.నారాయణ, సూర్య, కొండవలస,. ఉత్తేజ్, పృధ్వి, దువ్వాసి, కవిత తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం శ్రావణ్ బాపట్ల అందిస్తున్న ఈ చిత్రానికి పట్ల యాదగిరి, శ్రావణ్ బాపట్ల పాటలు, షమ్ము వి.ప్రభాకర్ సినిమాటోగ్రఫీ, వై.సత్య సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|