'కరెంట్' ట్రైలర్స్ విడుదల
సుశాంత్, స్నేహ ఉల్లాల్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ 'కరెంట్'. నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఈ చిత్రం థియేటర్ ట్రైలర్స్ ను రిలీజ్ చేశారు. హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ లోని అక్కినేని నాగేశ్వరరావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో అక్కినేని చేతుల మీదుగా ఈ ట్రైలర్స్ విడుదలయ్యాయి. చిత్రం లోగోను శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆవిష్కరించారు.
అక్కినేని మాట్లాడుతూ, 'కరెంట్' కథ కానీ, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు కానీ తనకు అంతగా తెలియవనీ, అయితే యూత్ ఫుల్ చిత్రం కాబట్టి తప్పకుండా యూత్ ను ఆకట్టుకునే విధంగా సినిమాను తీసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. తన మనుమడు సుశాంత్ కు ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుశాంత్, స్నేహ ఉల్లాల్, చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల, సూర్య ప్రతాప్ కూడా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|