బాలయ్య అవిష్కరించిన 'రైడ్'
హీరోల్లో ఒకరైన నాని మాట్లాడుతూ, హేమచంద్ర మంచి సంగీత దర్శకుడిగా అనిపించుకుంటారనీ, అలాగే రమేష్ వర్మ చాలా కష్టపడి సినిమాను బాగా తీర్చిదిద్దారనీ అన్నారు. ఈ సినిమా విజయం కోసం అంతా ఎదురుచూస్తున్నట్టు మరో కథానాయకుడు తనీష్ పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించడం, రీమిక్స్ సాంగ్ లో చేయడం సంతోషంగా ఉందని అక్ష పేర్కొంది. సినిమాలో మంచి ఎనర్జీ ఉందనీ, అందర్నీ ఆకట్టుకుంటుందని శ్వేతబసు ప్రసాద్ తెలిపింది. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి హేమచంద్ర మంచి సంగీతం అందించారనీ, భవిష్యత్ లో మంచి సంగీత దర్శకుడుగా పేరుతెచ్చుకుంటారని అన్నారు. బాలకృష్ణ సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేశామనీ, అందరూ రింగ్ టోన్ గా పెట్టుకునేంత బాగా ఈ సాంగ్ ఉంటుందనీ చెప్పారు. ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే బాలకృష్ణ బాబు ఈ కార్యక్రమానికి రావడం జీవితంలో మరచిపోలేననీ, నిర్మాతగా తనకు అవకాశం ఇచ్చింది శ్రీహరి అయినా పరిశ్రమలో తనకు ఈ స్థాయి రావడానికి కారణం బాలకృష్ణేనని అన్నారు. ఆయన డేట్స్ ఇస్తే మరో సినిమా తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. త్వరలోనే మంజు అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక యూత్ ఫుల్ రొమాంటింక్ ఎంటర్ టైనర్ ను తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'రైడ్' ఆడియో విడుదలైంది.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|