సంగీత దర్శకుడిగా రఘుకుంచె
సంగీత దర్శకులు కావడానికి దగ్గర దారి సింగర్స్ కావడం. పలువురు యువ సింగర్లు ఇప్పుడు సంగీత దర్శకులుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా రఘు కుంచె మ్యూజిక్ డైరెక్టర్ల బెటాలియన్ లోకి చేరబోతున్నారు. సింగర్ గా, ప్రముఖ యాంకర్ గా పేరున్న రఘు కుంచె అతి తర్వలోనే పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించనున్న చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు. పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
రఘు కుంచె 'బాచి' (2000) చిత్రంలోని 'లచ్చిమి లచ్చిమి' చిత్రం ద్వారా సింగర్ గా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'దేశముదురు', 'పందెంకోడి' వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇటీవల ఆయన కంపోజ్ చేసిన 'రఘు విత్ లవ్' అనే ప్రైవేట్ ఆల్బమ్ కూడా విడుదలైంది. త్వరలోనే 'లవ్ ఇన్ న్యూయార్క్' అనే వీడియో ఆల్బమ్ ను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో పూరీ జగన్నాథ్ నుంచి ఆఫర్ రావడంతో సంగీత దర్శకుడిగా వెండితెరపై కూడా రఘుకుంచెం అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందనీ, జూన్ లో సాయిరామ్ శంకర్ చిత్రం సెట్స్ పైకి వస్తుందనీ తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా పూరీ శిష్యుడు రవి దర్శకుడిగా పరిచయం కానున్నారు.
Be first to comment on this News / Article!
|