'కిక్'కూ సీక్వెల్...
'అరుంధతి' చిత్రం తర్వాత ఈ ఏడాది సరైన హిట్లు లేని కొరతను 'కిక్' తీరుస్తూ బాక్సాఫీస్ సెక్సెస్ దిశగా దూసుకు వెళ్తోంది. విడుదలైన తొలి రోజు నుంచి ఈ చిత్రానికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లేకపోవడం, ప్రేక్షకులు ఆశించిన ఎంటర్ టైన్ మెంట్ ఉండటం, రవితేజ-ఇలియానా క్రేజీ కాంబినేషన్ ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. సినిమా ప్రథమార్థం ఆకట్టుకుని ద్వితీయార్థం ఓ మోస్తరుగా ఉందనిపించకున్నా ఓవరాల్ గా సగటు ప్రేక్షకుడిని అలరించడంలో 'కిక్' ముందుంది. వీటికి తోడు ఇతర సినిమాల నుంచి నామమాత్రం పోటీ మాత్రమే ఉండటం కూడా మంచి వసూళ్లు రాబట్టుకుంటోందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'అతనొక్కడే' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సరైన హిట్లు లేని సురేందర్ రెడ్డికి సైతం ఈ చిత్రం ఫలితం సరైన 'కిక్' ఇస్తోంది. సినిమా ఉన్న థీమా కారణంగానో మరో కారణంగానో కానీ ఈ చిత్రం చివర్లో కిక్-2 అనే కార్డ్ వేయడం ద్వారా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందనే అభిప్రాయానికీ ఆయన తావిచ్చారు.
దీనిపై సురేందర్ రెడ్డి వివరణ ఇస్తూ 'ప్రస్తుతం కిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాం. పెద్ద రేంజ్ కు సినిమా వెళ్తుందనేది అనుకుంటున్నాం. మళ్లీ రవితేజతోన సీక్వెల్ చేయాలనే ఆలోచన అయితే ఉంది. అందుకు అందుకు కొంత సమయం పడుతుంది. ముందుగా ఒప్పుకున్న కమిట్ మెంట్ల తరువాతే ఆ విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తాను' అంటూ నవ్వుతూ చెప్పారు.
Be first to comment on this News / Article!
|