రామ్ పుట్టినరోజు వేడుక
'దేవదాసు', 'రెడీ' చిత్రాల హీరో రామ్ శుక్రవారంనాడు తన పుట్టినరోజు వేడుకను స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్న తన తాజా చిత్రం సెట్స్ లో జరుపుకొన్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కొండాపూర్ లోని ఎక్స్ ప్రెస్ టవర్స్ లో ప్రసుతం షూటింగ్ జరుగుతోంది. రామ్ తో పాటు పలువురు చిన్నారులు, రజిత తదితరులపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దీనికి పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ సభ్యుల మధ్యన రామ్ కేక్ కట్ చేసి తన సంతోషాన్ని వారితో పంచుకున్నారు. 'హీరోరామ్ డాట్ కామ్'ను ప్రారంభించారు.
రామ్ మాట్లాడుతూ, తన పెద్దనాన్న అయిన స్రవంతి రవికిషోరో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ లో చిన్నారుల మధ్య బర్త్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంతవరకూ తన పేరుతో వెబ్ సైట్ లేనందున అది కూడా ప్రారంభించినట్టు చెప్పారు. రవికిషోర్ మాట్లాడుతూ, 'రెడీ' వంటి మంచి హిట్ తర్వాత మళ్లీ రామ్ తో చేస్తున్న ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందన్నారు. ఈ చిత్రం పెద్దలతో పాటు పిల్లలను ఎంతగానో అలరిస్తుందనీ, త్వరలోనే మూడు పాటలు స్విట్జర్లాండ్ లో తీస్తామనీ చెప్పారు. జూలైలో సినిమా పూర్తి చేసి ఆగస్టు చివర్లో కానీ, సెప్టెంబర్ మొదటివారంలో కానీ సినిమా విడుదల చేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|