పరశురామ్-గణేష్ కొత్తచిత్రం
నటుడు గణేష్ బాబు నిర్మాతగా మారి పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై వరుస చిత్రాల నిర్మాణం చేపడుతున్నారు. పవన్ కల్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ప్రొడక్షన్ నెంబర్ 1' చిత్రాన్ని ప్లాన్ చేసిన గణేష్ బాబు అంతకంటే ముందుగా రవితేజ హీరోగా పరశురామ్ ('యవత' ఫేమ్) దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్-2 గా 'ఆంజనేయులు' చిత్రాలు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ పరశురామ్ దర్శకత్వంలో తన బ్యానర్ నుంచి 'ప్రొడక్షన్ నెంబర్ 3' ఉంటుందని గణేష్ బాబు తాజాగా ప్రకటించారు.
ఆ విశేషాలను తెలియజేస్తూ...పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న 'ఆంజనేయులు' చిత్రం ఎక్స్ టార్డినరీగా వస్తోందనీ, చాలా పెద్ద హిట్ అవుతుందనీ అన్నారు. ఆగస్టులో ఈ చిత్రం రిలీజ్ అవుతుందనీ, వెంటనే అక్టోబర్ నుంచి ఓ ప్రముఖ హీరోగా పరశురామ్ దర్శకత్వంలోనే మరో భారీ చిత్రాన్ని నిర్మించనున్నాననీ చెప్పారు. ఇందుకు అద్భుతమైన కథను కూడా పరశురామ్ రెడీ చేశారని చెప్పారు. పరశురామ్ మాట్లాడుతూ, గణేష్ తో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉందనీ, పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ తన సొంత సంస్థలాంటిదనీ చెప్పారు. అక్టోబర్ నుంచి మళ్లీ ఇదే బ్యానర్ లో ఇంకో సినిమా చేస్తున్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
Be first to comment on this News / Article!
|