రీరికార్డింగ్ లో 'అల్లం వెల్లుల్లి'
అరుణ్, శ్రీకర్, రాణి, సింధులను హీరోహీరోయిన్లుగా పరిచయం చే్స్తూ పివిఆర్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ పల్లా దర్శకత్వంలో రూపొందుతున్న వినూత్న కథా చిత్రం 'అల్లం వెల్లుల్లి'. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రీరికార్డింగ్ జరుపుకొంటోందని కిరణ్ పల్లా తెలిపారు.
ఇంతవరకూ తెలుగులో రానటుంవంటి హోటల్ మేనేజ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించామనీ, బేసికల్ గా ఇది ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనీ చెప్పారు. ఇందులోని 20 నిమిషాల గ్రాఫిక్ వర్క్ ప్రధాన హైలైట్ గా నిలుస్తుందన్నారు. అలాగే ఇందులోని 7 పాటలకు సంగీత దర్శకుడు సిగ్ధ ఎంతో మెలోడియస్ ట్యూన్స్ ఇచ్చారనీ చెప్పారు. యువతరం ప్రేక్షకులను ఈ పాటలు ఉర్రూతలూగిస్తాయని అన్నారు. ఈనెలాఖరులోనే ఆడియో, జూన్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్, మేల్కొటె, సమీర్, సన, సురేఖావాణి, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. బండి సత్యం-అవినాస్ పాటలు, క్రిష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|