'వేదం' క్రెడిట్ అల్లు అర్జున్ దే
'గమ్యం' చిత్రంతో కొత్త తరహా చిత్రాలకు ఓ దిశా నిర్దేశం చేసిన క్రిష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో మరో సంచలనానికి తెరతీస్తున్నారు. సింగిల్ హీరోల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తున్న టాలీవుడ్ ను మల్టీస్టారర్ చిత్రాల వైపు ప్రోత్సహించే దిశగా ఆయన 'వేదం' చిత్రాన్ని ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. స్టయిలిష్ హీరో అల్లు అర్జున్, ప్రామిసింగ్ హీరో మంచు మనోజ్, 'అరుంధతి', 'బిల్లా' చిత్రాలతో అగ్రపథంలో దూసుకుపోతున్న అనుష్కను ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ గా ఎంపిక చేయడం టాలీవుడ్ లో సంచలన టాపిక్ గా మారింది. అంతా కొత్త వాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాననీ, అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ సీన్ లోకి రావడం, మనోజ్ పేరును సూచంచడం జరిగిందంటూ క్రిష్ వెల్లడించారు.
'కొత్త నటీనటులతో సినిమా తీయాలని అనుకుంటున్న విషయాన్ని మాటల సందర్భంలో అల్లు అర్జున్ తో ముచ్చటించాను. ఆయన కథ చెప్పమని అడిగారు. సుమరు 15 నిమిషాల పాటు కథ వినిపించాను. ఆయన వెంటనే మనమే చేద్దాం అన్నారు. ఆ రోజు నించి రెండు నెలల పాటు కూర్చుని పూర్తి స్క్రిప్టు రెడీ చేశాను. మళ్లీ ఆయనకు బౌండ్ స్క్రిప్టు ఇచ్చాను. మరో హీరో ఎవరైతే బాగుంటారని ఆయనను అడిగినప్పుడు మనోజ్ పేరును ఆయన సూచించారు. వెంటనే మనోజ్ ను సంప్రదించి స్టోరీ వినిపించాను. వెంటనే ఆయన తన అంగీకారం తెలియజేశారు' అని క్రిష్ వివరించారు. అనుష్క ఎంపిక విషయంలో జరిగిన ఎక్సర్ సైజ్ ను వివరిస్తూ 'స్క్రిప్టు విన్న అనుష్క ఏ విషయం చెప్పడానికి కొంత సమయం తీసుకుంది. అయితే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నట్టు తెలియగానే వెంటనే తన అంగీకారం తెలియచేసింది. అరుంధతి, బిల్లా వంటి రెండు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన అనుష్క ఈ సినిమా ఒప్పుకోవడం చాలా ఎగ్జయిటింగ్ కలిగించింది' అన్నారు. బెస్ట్ స్క్రిప్టులలో 'వేదం' కూడా ఒకటనీ, చిన్న ప్రాజెక్ట్ గా మొదలై బిగ్ కేన్సావ్ ను సంతరించుకుందంటే ఆ క్రెడిట్ అల్లు అర్జున్ కే దక్కుతుందని అన్నారు. ఇందులో ప్రధానంగా మూడు లీడ్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ, ప్రతి క్యారెక్టర్ కూ ప్రత్యేకత ఉంటుందనీ, జూన్ మధ్యలో హైద్రాబాద్ లో షూటింగ్ మొదలవుతుందనీ క్రిష్ చెప్పారు.
Be first to comment on this News / Article!
|