'మళ్లీ స్విమ్ సూట్ వేయను'
'స్లిమ్మింగ్ ఫూల్ లో దిగినప్పుడు సల్వార్ కమీజ్ వేసుకోలేం కదా. అయినా స్విమ్ సూట్ వేసుకోవడం కంఫర్టబుల్ గా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు' అంటోంది ప్రియమణి మురిపెంగా. 'ద్రోణ' చిత్రంలో ఒక పాటంతా బికినీలోనే కనిపించి సంచనలం సృష్టించిన ప్రియమణి మళ్లీ బికినీతో కనిపించే అవకాశాలపై అడిగినప్పుడు 'నో' చెప్పేసింది. 'ద్రోణ' చిత్రం దర్శకుడి కోరిక మేరకు, సన్నివేశం డిమాండ్ చేయడంతోనే బికినీ ధరించి నటించాననీ, అయితే ఇది మళ్లీ రిపీట్ చేయలేదననీ ప్రియమణి తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.
'ఆహార్యాన్ని బట్టే దుస్తులు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. నా వరకు స్విమ్ సూట్ కంపర్టబుల్ గా ఉంటుందని ఎప్పుడూ అనుకోను. నిండుగా ఉండే ఫిగర్ వల్ల స్విమ్ సూట్ నాకు అంతగా నప్పుదు. మళ్లీ మళ్లీ అలా కనపించాలని కూడా అనుకోవడం లేదు' అంటూ వివరణ ఇచ్చింది. అలాగని తాను గ్లామర్ పాత్రలకు ఎంతమాత్రం దూరం కాననీ, స్విమ్ సూట్ ధరించికపోయినా వర్షం సాంగ్స్ లో నటించడానికి ఏ మాత్రం అభ్యంతరంలేదంటూ తన అభిమానులకు ఒకింత ఊరట కూడా కలిగించింది. ప్రస్తుతం ప్రియమణి దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించడంతో పాటు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో తమిళ, హిందీ భాషల్లో ప్రస్తుతం రూపొందుతున్న 'రావణ్' చిత్రంలో శూర్పణక తరహా నెగిటివ్ టచ్ పాత్ర పోషిస్తోంది. జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 'పరుత్తి వీరన్' తరహాలో మంచి కథాచిత్రం దొరికితే మళ్లీ మేకప్ లేకుండా నటించేందుకు కూడా సిద్ధమేనని చెప్పింది. కొసమెరుపుగా...ప్రిన్స్ మహేష్ బాబు 'వరుడు' సినిమాలో తాను నటించనున్న వార్తల్లో నిజం లేదనీ, తనను ఎవరూ సంప్రదించలేదనీ తేల్చిచెప్పింది.
Be first to comment on this News / Article!
|