'వైఎస్ కు అభినందనలు'
'రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఇందుకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం' అని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, కార్యదర్శి టివిడి ప్రసాద్ అన్నారు. ఆదివారంనాడు ఫిలి చాంబర్ లో నిర్మాతల మండలి తరఫు అభినందన సభను ఏర్పాటు చేశారు.
చిత్ర పరిశ్రమ హైద్రాబాద్ కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమ బాగు కోసం ఎంతో చేసిందనీ, ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ప్రజలు సుస్థిర పాలనను కోరుకుంటూ తీర్పు ఇచ్చినందున సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం మరింత చేయూత నివ్వాలని మండలి తరఫు కోరుకుంటున్నామని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక సందర్భంలో రాజశేఖర్ రెడ్డిని కలిసి ఐదేళ్ల తర్వాత కుదురుతుందో లేదో ఇప్పుడే తమ సమస్యలు పరిష్కారిచాల్సిందిగా కోరామనీ, మళ్లీ మనమే అధికారంలోకి వస్తామనీ, ఏమీ ఫరవాలేదనీ ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. ఆయన చెప్పిందే జరిగి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, అభివృద్ధి చూసి ఓటు వేసిన ప్రజలకు తాము కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వై.ఎస్.కు అభినందనలు తెలియజేస్తున్నామనీ అన్నారు. సినిమా పరిశ్రమ ఎప్పుడు సమస్యల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించి పరిష్కరించాయని టివిడి ప్రసాద్ పేర్కొన్నారు. ఈసారి ముఖ్యంగా విశాఖపట్నంలో పరిశ్రమ అభివృద్ధి కోసం వై.ఎస్. మరింత కృషి చేయాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. పరిశ్రమ తరఫున రాజకీయాల్లోకి వచ్చి గెలుపొందిన చిరంజీవి, జయప్రద, విజయశాంతి, కొడాలి నాని తదితరులకు అభినందనలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|