వీరూ 'గుడు గుడు గుంజం'
'ఆరోప్రాణం' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన వీరు కె ఆ మధ్యన న్యూజనరేషన్ సినిమాలంటూ తీసిన సినిమాలు ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. '2 మచ్', 'ఎక్స్ ట్రా' చిత్రాలతో ఆయనపై సి గ్రేడ్ చిత్రాల ముద్ర పడింది. కొద్ది కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన తన పేరులో మార్పు చేసుకుని వీరు ద్వైత్ గా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరు ద్వైత్ దర్శకత్వంలో వి.రవికుమార్ శ్రీ చిత్ర బ్యానర్ పై రూపొందించనున్న ఈ చిత్రానికి 'గుడు గుడు గుంజం' అనే టైటిల్ నిశ్చయించారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైద్రాబాద్ లోని అర్పీ పట్నాయక్ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకనిర్మాతలు ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
నూతన చిత్రం వివరాలను దర్శకనిర్మాతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇష్టపడే కథాంశంతో పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామనీ, ఈనెల 28న షూటింగ్ ప్రారంభిస్తామనీ చెప్పారు. 60 శాతం షూటింగ్ బ్యాంకాక్, పుకెట్ లో ప్లాన్ చేశామనీ, జూలై 31వ తేదీకి తొలి కాపీ సిద్ధమవుతుందనీ చెప్పారు. ప్రస్తుతం హీరో హీరోయిన్లు ఎంపిక జరుగుతున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ధర్మవరపు, తనికెళ్ల భఱణి, కృష్ణ భగవాన్, కొండవలస, సుమన్ శెట్టి, దండపాణి తదితరులు నటించనున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|