'అనకొండ-3' గా మెగాస్నేక్
హాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన పలు చిత్రాలు వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువాదమై ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాయి. తాజాగా హాలీవుడ్ లో రూపొందిన 'మెగా స్నేక్' చిత్రాన్ని మల్టీ విజన్ సంస్థ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తోంది. తెలుగులో ఈ చిత్రం 'అనకొండ-3' పేరుతో అనువాదమవుతోంది. లక్ష్మీ పాండురంగా ఫిలింస్ పతాకంపై సి.హెచ్.ఉమామహేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు.
ఇంతకుముందు వచ్చిన 'అనకొండ' చిత్రాల కంటే విభిన్నంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు. కథాంశాన్ని వివరిస్తూ...ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త పాములపై ప్రయోగం చేస్తుంటాడు., ప్రపంచంలోని విభిన్న జాతులకు చెందిన పాములను గ్లాస్ జార్ లలో పెంచుతుంటాడు. ఒకరోజు అనుకోకుండా గ్లాస్ జార్ కింద పడి అందులోంచి రెండు అడుగుల పాము బయటపడుతుంది. భయంకరమైన అనకొండగా రూపాంతరం చెందుతుంది. మనుషులపై దాడి చేసి అమాతం మింగేస్తుంటుంది. దాంతో శాస్త్రవేత రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఆసక్తికరంగా ఉంటుందని ఆయన తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి టిబోర్ టకాస్ దర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
|