'కిక్' టీమ్ విజయోత్సాహం
రవితేజ, ఇలియానా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించిన 'కిక్' చిత్రం సమ్మర్ కానుకగా ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తోంది. ఆ సంబరాన్ని చిత్రయూనిట్ ఆదివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ తో జరుపుకొంది. రవితేజ, సురేందర్ రెడ్డి, అచ్చిరెడ్డి, సురేష్ రెడ్డి, వక్కంతం వంశీ, రసూల్ ఎల్లోర్, తమన్ తదితరులు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకం నుంచి వచ్చిన మరో సక్సెస్ ఫుల్ చిత్రమిదనీ, ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోందనీ అన్నారు. సమష్టి కృషికి దక్కిన విజయమిదని ఆయన అభివర్ణించారు. సహ నిర్మాత సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన దర్శకుడు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. సినిమా విజయం పట్ల సంగీత దర్శకుడు తమన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ద్వారా రంజిత్, నవీన్ మాధవ్, రాహుల్ నంబియార్ అనే ముగ్గురు నేపథ్యగాయకులను పరిచయం చేసినట్టు చెప్పారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు తాను కథ అదించడం సంతోషంగా ఉందని వక్కంతం వంశీ పేర్కొన్నారు. రవితేజ మాట్లాడుతూ, కథ, నిర్మాత, దర్శకుడిని చూసి తాను ఈ సినిమాలో నటించనట్టు చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని చక్కగా మలిచారనీ, సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తన కృతజ్ఞతలనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|