రీనా రాహుల్ దేవ్ మృతి
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి హిందీ, తెలుగు, తమిళ. మలయాళ, బెంగాళీ చిత్రాల్లో విలనీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ దేవ్ కు భార్యావియోగం సంభవించింది. ఆయన భార్య రీనా కేన్సర్ వ్యాధితో గత శనివారంనాడు కన్నుమూశారు.
రీనా కొద్దికాలంగా కేన్సర్ వ్యాధితో ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స కోసం ఇటీవల ముంబైలోని వెర్సోవా రెసిడెన్స్ నుంచి రాహుల్ దంపతులు ఢిల్లీ షిఫ్ట్ అయ్యారు. 11 ఏళ్ల క్రితం రాహుల్ -రీనాల వివాహం జరిగింది. వీరికి సిద్దార్ధ అనే పదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. రీనా చికిత్స పొందుతూ అంతిమశ్వాస విడిచిందనీ, ఆమె మరణం తమ కుటుంబానికి తీరని లోటనీ రాహుల్ సోదరుడు, నటుడు ముకుల్ తెలిపారు. రాహుల్ జీవితంలో ఇది కోలుకోలేని దెబ్బ అనీ, రీనా మృతితో ఆయన తీవ్ర విచారంలో మునిగిపోయారనీ ఆయన సన్నిహితుడు ఒకరు పేర్కొన్నారు. రాహుల్ 'దస్' చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వివిధ భాషా చిత్రాలతో పాటు తెలుగులోనూ 'టక్కరిదొంగ', 'సింహాద్రి', 'అస్త్రం', 'పౌర్ణమి', 'చిన్నోడు', 'ఒక్కడున్నాడు', 'బ్యాంక్' వంటి పలు చిత్రాల్లో నటించారు.
Be first to comment on this News / Article!
|