'దేశద్రోహి'కోసం నమిత ఫైట్స్
నమిత పోలీసు అధికారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దేశద్రోహి' చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో జి.వి.హెచ్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం నమిత పాల్గొంటున్న భారీ యాక్షన్ దృశ్యాలను హైద్రాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.
చిత్రం ప్రోగ్రస్ ను దర్శకుడు తెలియజేస్తూ, ఈనెల 14 నుంచి ప్రారంభమైన రెండో షెడ్యూల్ 12 రోజుల పాటు కొనసాగుతుందనీ, ఇందులో భాగంగానే ఫైట్ మాస్టర్ విజయన్ శిష్యుడు పవర్ స్టార్ సారథ్యంలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోందన్నారు. అన్నపూర్ణ స్టూడియో, గోల్కొండ కోట వద్ద నమిత, రవి, శోభన్ లపై ఈ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరస్తున్నామనీ, హైద్రాబాద్ పరిసరాల్లోని బాచుపల్లిలో మరో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఇదే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నామనీ చెప్పారు. 'కర్తవ్యం' చిత్రం విజయశాంతికి ఎంత పేరు తెచ్చిందో ఈ చిత్రం నమితకు అంత మంచి పేరు తెస్తుందనీ, చాలా కష్టపడి ఈ చిత్రంలో నటిస్తోందనీ తెలిపారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో నటించనున్నారనీ, తదుపరి షెడ్యూల్ లో ఆ వివరాలను ప్రకటిస్తామనీ నిర్మాత ప్రసాద్ తెలిపారు. జూలై వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, ఆగస్టు 15న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, రామిరెడ్డి, వల్లభనేని జనార్దన్, కృష్ణభగవాన్, సన, రవి, శోభన్, ప్రత్యేక పాత్రలో శాంతిచంద్ర తదితరులు నటిస్తున్నారు. శ్రీదేవి సినీ చిత్ర యూనిట్ కథ, కమలేష్ కుమార్ స్క్రీన్ ప్లే, కిషన్ సాగర్ సినిమాటోగ్రఫీ, రాంబాబు ఎడిటింగ్, శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|