చిరుకు 'మా' అభినందనలు
తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టనున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అభినందనలు తెలియజేసింది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేసింది. జూబ్లీ హిల్స్ లోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో చిరంజీవిని 'మా' తరఫున మురళీ మోహన్, ఏవీస్, ఆహుతిప్రసాద్, బ్రహ్మాజీ, అశోక్ కుమార్ తదితరులు మంగళవారంనాడు కలుసుకున్నారు. 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న చిరంజీవి ప్రజా సమస్యలతో పాటు చిత్ర పరిశ్రమ తరఫున కూడా తన వాణిని అసెంబ్లీలో వినిపించాలని 'మా' తరఫున మురళీమోహన్ ఆయనను కోరారు.
చిరంజీవి స్పందిస్తూ, దాదాపు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న తనకు అక్కడి సమస్యలు పూర్తిగా తెలుసుననీ, ప్రజా సమస్యలతో పాటు పరిశ్రమ సమస్యలపై కూడా తప్పనిసరిగా శ్రద్ధ చూపిస్తాననీ భరోసా ఇచ్చారు.
Be first to comment on this News / Article!
|