ఎన్టీఆర్ హ్యాపీ బర్త్ డే
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారంనాడు మరో వసంతంలోకి అడుగుపెట్టారు. సహజంగా అభిమానుల కేరింతల మధ్య, కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటూ తన పుట్టినరోజు వేడుకను ఆయన జరుపుకొనే వారు. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురికావడంతో వైద్యుల చికిత్స మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'అదుర్స్ ' చిత్రం షూటింగ్ కు మూడు నెలల పాటు బ్రేక్ పడింది. ఇంతవరకూ ఈ చిత్రానికి సంబంధించి 45 శాతం షూటింగ్ తో పాటు సినిమాలోని ఆరు పాటల్లో ఒక పాటను రష్యాలోనూ, మరో పాటను హైద్రాబాద్ లో వేసిన సెట్ లోనూ చిత్రీకరించారు. మళ్లీ ఈ చిత్రం షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. నయనతార, షీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఇదే నెలలో అమెరికా వెళ్తారనీ, అక్కడ వైద్యుల సలహాలను కూడా తీసుకుంటారనీ తెలుస్తోంది. జూన్ ప్రారంభంలో జరిగే తెలుగువారి ఉత్సవాలలో పాల్గొని హైద్రాబాద్ తిరిగి వస్తారు. అనంతరం 'అదుర్స్' రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొని నిరవధిక షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తారు. ఈ చిత్రం తర్వాత మరో రెండు చిత్రాలకు కూడా ఎన్టీఆర్ కమిట్ అయ్యారు. వీటిలో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) దర్శకత్వంలో ఒక చిత్రం, దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి ('మున్నా' ఫేమ్) దర్శకత్వంలో మరో చిత్రం ఉండబోతున్నాయి. ఎన్టీర్ స్పీడ్ గా కోలుకుని సినీ చైత్రయాత్రను విజయవంతంగా సాగిస్తారని ఆయన బర్త్ డే సందర్భంగా ఆశిద్దాం.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|