మరో షెడ్యూల్ కు 'వరుడు'
'అతిథి' చిత్రం తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టకేలకు ఇటీవల 'వరుడు' చిత్రం కోసం ఇటీవల మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. 'అతడు'వంటి సెన్సేషన్ హిట్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల హైద్రాబాద్ లో మహేష్-అనుష్క జంటపై ఓ రొమాంటింక్ సాంగ్, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం అనుష్క బిజీ కారణంగా బ్రేక్ పడిందనీ, ఈనెల 23 నుంచి మరో షెడ్యూల్ మొదలవుతుందనీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
'అరుంధతి' చిత్రం ఇటు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి సాధించడంతో అనుష్క ఒక్కసారిగా బిజీ అయింది. ఇటీవల విడుదలైన 'బిల్లా' చిత్రం సైతం కమర్షియల్ సక్సెస్ ను చవిచూడటంతో ఆమె డిమాండ్ మరింత పెరిగినట్టయింది. దీనిని దృష్టిలో పెట్టుకునే 'వరుడు' చిత్రానికి ముందుగా ఎంపిక చేసిన పార్వతి మెల్టన్ ప్లేస్ లో అనుష్కను తీసుకున్నారు. ప్రస్తుతం 'వరుడు'తో పాటు విజయ్ సరసన ఓ తమిళ చిత్రంలో అనుష్క నటిస్తోంది. హైద్రాబాద్ పరిసరాల్లో తమిళ చిత్రం షూటింగ్ కారణంగా 'వరుడు' చిన్న పాటి బ్రేక్ తీసుకుందని సమాచారం. వీటికితోడు క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో జూన్ ప్రథమార్థంలో ప్రారంభం కానున్న 'వేదం' చిత్రానికి అనుష్క కమిట్ అయింది. హీరో విక్రమ్ తదుపరి చిత్రానికి కూడా అనుష్క తన అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈనెల 23 నుంచి జరుగనున్న 'వరుడు' షెడ్యూల్ లో అనుష్క-మహేష్ కాంబినేషన్ సన్నివేశాలపైనే త్రివిక్రమ్ ఎక్కువ దృష్టి సారిస్తారనీ, పక్కా ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలకు సిద్ధం చేస్తారని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|