వైఎస్ కు 'మా' అభినందన
ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బుధవారంనాడు శుభాకాంక్షలు తెలియజేసింది. వై.ఎస్. ప్రజాదరణతో మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టుతుండటం పట్ల 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆహుతి ప్రసాద్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేశారనీ, ఎన్నో రాయితీలు కూడా కల్పించారనీ వారు పేర్కొన్నారు. రెండోసారి పదవీ ప్రమాణస్వీకారం చేస్తున్న ఆయనకు శుక్షాకాంక్షలు తెలియజేశారు. పరిశ్రమకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయాయనీ, వాటిని కూడా ముఖ్యమంత్రి పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|