నిరాడంబరంగా ఎన్టీఆర్ బర్త్ డే
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారంనాడు తన 25వ బర్త్ డేను నిరాడంబరంగా కుటుంస సభ్యుల మధ్య జరుపుకొన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తూ జరిగిన ప్రమాదం నుంచి ఎన్టీఆర్ ఇప్పుడు దాదాపు కోలుకున్నారు. రెట్టించిన ఉత్సాహం ఆయనలో తొంగిచూస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు బుధవారం ఉదయం నుంచి మెహదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున మురళీమోహన్, ఏవీయస్, నటుడు అశోక్ కుమార్ తదితరులు ఆయనను కలుసుకుని విషెస్ తెలియజేశారు. కొడాలి నాని, వి.వి.వినాయక్ తదితర సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ ను కలుసుకుని శుభాకాక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
ఎంతో ఆత్మీయతతో తనను కలుసుకుని బర్త్ డే విషెస్ తెలిపిన అందరికీ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వచ్చి అందిరి అభిమానం చూరగొంటానని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా వి.వినాయక్ దర్శకత్వంలో వల్లభనేని వంశీ నిర్మిస్తున్న 'అదుర్స్ ' చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. అమెరికాలో జూలైలో జరగనున్న 'తానా' సెలబ్రేషన్స్ లోనూ ఏన్టీఆర్ పాల్గొంటారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|