ఎక్స్ పోజింగ్ చేయను: సోనియా
శ్రావ్య్ (హ్యాపీడేస్), నూడిల్స్ (వినాయకుడు) అనే నిక్ నేమ్స్ తో యువతరం ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోనియా తన తదుపరి చిత్రాల ద్వారా వారికి మరింత దగ్గరవుతానని చెబుతోంది. టి 20 నెంబర్ వన్ ఫామ్ ప్రెడ్జీ ఆధ్వర్యంలో బేగంపేట 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టి-20 మ్యాచ్ ను తిలకిచేందుకు నిర్వహించిన ఆన్ లైన్ పోటీలో విజేతలకు సోనియా చేతుల మీదుగా టిక్కెట్లు అందజేశారు.
టి-20 మ్యాచ్ లు తిలకించడమంటే మిత్రులంతా కలుసుకుని మధురమైన క్షణాలు పంచుకోవడమేననీ, విజేతలకు టిక్కెట్లు తన చేతుల మీదుగా ఇవ్వడం ద్వారా వారి సంతోషంలో తాను కూడా పాలుకుంచుంటున్నాననీ సోనియా సంతోషం వ్యక్తం చేసింది. తన సినీ కెరీర్ ను ముచ్చటిస్తూ, వైవిధ్యమైన పాత్రలు పోషించడం ద్వారా ఎక్స్ పెరెమెంట్స్ చేయడానికే తాను ఇష్టపడతాననీ, తన మొదటి రెండు చిత్రాల్లోని క్యారెక్టర్ల కంటే భిన్నంగా ఉండే క్యారెక్టర్లకే తాను ప్రాధాన్యం ఇస్తాననీ చెప్పింది. జనం ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్రలు చేయాలన్నదే తన అభిమతమని పేర్కొంది. తెలుగులో ప్రస్తుతం జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రం, తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాననీ, మరో కన్నడ చిత్రం, తమిళ చిత్రం స్క్రిప్టులు కూడా తన పరిశీలనలో ఉన్నాయనీ చెప్పింది. 'వినాయకుడు' సీక్వెల్ లో వేరే కథానాయిక నటిస్తోందన్నారు. ఎక్స్ పోజింగ్ విషయంలో తనకు కచ్చితమైన అభిప్రాయముందని చెప్పుకొచ్చింది. 'ఎక్స్ పోజింగ్ కి హద్దులుండాలి. పాత్రకు అవసరమైనంత వరకే చేయాలి. మితి మీరిన ఎక్స్ పోజింగ్ అయితే నో చెప్పేస్తా. కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్ లు ధరించడానికి మాత్రమే నేను ఎప్పుడూ ఇష్టపడతాను' అని తేల్చిచెప్పింది. రెండు హిట్లు రాగానే స్టార్ హీరోలతో నటించడమే తమ ధ్యేయమని హీరోయిన్లు చెప్పడం రివాజే అయినా...స్క్రిప్టు, తన పాత్ర నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటానని చెబుతున్న సోనియాను అభినందించాల్సిందే.
Be first to comment on this News / Article!
|