సూర్య-అనుష్క ద్విభాషా చిత్రం
'గజనీ' చిత్రం తర్వాత సరైన హిట్ కోసం కొద్దికాలంగా ఎదురుచూస్తున్న సూర్యకు మళ్లీ తమిళ 'అయన్' చిత్రం టాప్ స్టార్ గా నిలబెట్టింది. ఆ చిత్రం తెలుగులో 'వీడొక్కడే'గా ఇటీవల విడుదలైంది. సరిగ్గా ఇలాంటి బ్రేక్ కోసమే కొద్దికాలంగా ఎదురుచూస్తున్న నటి అనుష్కకు 'అరుంధతి' చిత్రం ఆమెను టాప్ హీరోయిన్ రేంజ్ కు చేర్చింది. ఆ తర్వాత వచ్చిన 'బిల్లా' సైతం ఆమెలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులను మెప్పించింది. 'అరుంధతి' తమిళ వెర్షన్ కూడా సక్సెస్ కావడంతో ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ అనుష్కకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం మహేష్ తో 'వరుడు' చిత్రంలోనూ, విజయ్ తో ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తూ, క్రిష్ 'వేదం' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం సూర్య కథానాయకుడుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న చిత్రంలోనూ అనుష్క నటించేందుకు అంగీకరించింది.
సూర్య, అనుష్క తొలి కాంబినేషన్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ నిర్మించబోతున్నారు. దీనికి హరి దర్శకుడు. ఈ సంస్థ ఇటీవల సూర్య కథానాయకుడుగా 'నువ్వు నేను ప్రేమ' అనే చిత్రాన్ని నిర్మించింది. తాజా చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారనీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తారనీ తెలుస్తోంది. జూన్ లో ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|