క్లోనింగ్ మనిషి 'వ్యాపారి'
క్లోనింగ్ ద్వారా ఇంతవరకూ జంతువులను మాత్రమే సృష్టించడం అందరికీ తెలుసుననీ, క్లోనింగ్ ద్వారా మనిషిని సృష్టిస్తే ఎలాంటి అద్భుతాలు జరిగాయనేది 'వ్యాపారి' చిత్రం చూసి తెలుసుకోవలసిందేననీ నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస రావు చెబుతున్నారు. ఎస్.జె.సూర్య ('ఖుషీ', 'కొమురం పులి' దర్శకుడు) ద్విపాత్రాభినయంలో శక్తి చిదంబరం దర్శకుడిగా తమిళంలో విజయవంతమైన 'వ్యాబారి' చిత్రానికి ఇది అనువాదరూపం. ప్రణతి క్రియేషన్స్ పతాకంపై కూనిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమన్నా, నమిత, మాళవిక హీరోయిన్లుగా నటించారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా గతంలో పలు చిత్రాలకు పనిచేసిన తాను తొలిసారి నిర్మాతగా మారి తమిళంలో విజయవంతమైన 'వ్యాబారి' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్టు కూనిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. దక్షిణాది భాషా చిత్రాల్లో ఎంతవరకూ ఎవరూ చేయని విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందిందనీ, ఎస్.జె.సూర్య నటన సినిమాకి మరో హైలైట్ అనీ చెప్పారు. తమన్నా నటనాపరంగానే గాకుండా గ్లామర్ పరంగా కూడా కొత్తగా కనిపిస్తుందనీ, నమిత, మాళవిక అందాల కుర్రకారును హుషారెక్కిస్తాయనీ తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలో ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు నటించారు. దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|