బెజవాడలో 'బిల్లా' వేడుక
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 'బిల్లా' చిత్రం సరైన హిట్ ను అందించింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ఈ గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభాస్, అనుష్క, నమిత ప్రధాన పాత్రధారులుగా, కృష్ణంరాజు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం అర్ధశతదినోత్సవాన్ని విజయవాడలో ఈనెల 24న జరిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
పదిహేనేళ్ల విరామం తర్వాత గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కృష్ణంరాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలిసారి ప్రభాస్- కృష్ణంరాజు కలిసి నటించడం, దర్శకుడు మెహర్ రమేష్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, అనుష్క, నమిత బికినీ అందాల్లో ప్రదర్శించిన గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచి బాక్సాఫీస్ హిట్ వైపు నడిపించాయి. తొలి మూడు వారాల్లో ఈ చిత్రం 16.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో ప్రేక్షకుల సమక్షంలోనే ఈ వేడుకను కృష్ణంరాజు నిర్వహించబోతున్నారు. ప్రభాస్, అనుష్క, నమిత, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటారు.
Be first to comment on this News / Article!
|