నవనీత్ తో ఈటీవీ సుమన్!
మీడియా మొఘుల్ రామోజీరావు తనయుడు సుమన్ ఇంతవరకూ ఈటీవీ సుమన్ గానే బుల్లితెర వీక్షకులందరికీ సుపరిచితుడు. ఈటీవీలో పలు పాపులర్స్ సీరియల్స్ ను ప్రెజెంటే చేసిన సుమన్ నటుడిగానూ, భక్తి గీతాల ఆల్బమ్స్ తో గాయకుడిగా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో తన తండ్రితో వచ్చిన విభేదాలపై ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ జనాల్లో బాగా ఫోకస్ అయింది. సుమన్ సొంతంగా టీవీ ఛానెల్ పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నారని కూడా అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి. అయితే అది కార్యరూపంలోకి ఇంకా రాలేదు. ఇందుకు ప్రతిగా ఆయన సొంతంగా సుమన్ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థను ఇటీవల స్థాపించి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంగా ఆయన నటిస్తూ నిర్మించిన 'ఉషా పరిణయం' చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సంస్థ రెండో చిత్రానికి కూడా ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. గ్లామర్ నటి నవనీత్ కౌర్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం..
'శీను వాసంతి లక్ష్మి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నవనీత్ కౌర్ ఆ తర్వాత 'జగపతి', 'భూమ', 'రూమ్ మేట్స్' వంటి పలు చిత్రాల్లో నటించింది. నటిగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నవనీత్ కౌర్ ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు కూడా మళ్లింది. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాలు నిర్మాణంలో కూడా ఉన్నాయి. తాజాగా నవనీత్ కథానాయికగా సుమన్ ప్రొడక్షన్స్ చిత్రానికి 'నాన్ స్టాప్' అనే టైటిల్ ను ఖరారు చేశారనీ, పలువురు కొత్త నటీనటులు నటించనున్న ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కానున్నారనీ తెలుస్తోంది. జూన్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
Be first to comment on this News / Article!
|