సెన్సారయిన 'లైఫ్ స్టైల్'
నిశ్చల్, మీనాక్షి దీక్షిత్ ను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.ఎమ్.సినీ మ్యాక్స్ పతాకంపై శ్రీమాధవ్ పట్నాయక్ నిర్మించిన 'లైఫ్ స్టైల్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నెలాఖరులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ముప్పలనేని శివ ఆ విశేషాలను తెలియజేస్తూ, ఇంతవరకూ కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన తాను మొదటిగారి ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. సహజంగా తన చిత్రాలు సెన్సార్ కు వెళ్లినప్పుడు అక్కడి సభ్యులకు పెద్దగా పని ఉండదనీ, యూత్ ఫుల్ చిత్రమైనా ఎలాంటి అసభ్యత, అశ్లీలతకు తావులేకుండా వినోదానికి పెద్ద పీట వేస్తూ ఈ సినిమా తీయడంతో సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా తమకు లభించాయనీ చెప్పారు. ఇటీవల కాలంలో ఇంత మంచి సినిమా రాలేదని సభ్యులంతా మెచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ లోనే ఈ చిత్ర మెమరబుల్ హిట్ గా నిలుస్తుందనే గట్టి నమ్మకం ఉందని అన్నారు. ఈనెలాఖరులోనే సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అభిరామ్, కార్తీక్ , మేల్కొటే, అనంత, శివపార్వతి, సన, అంబటి శీను తదితరులు నటించారు. ఓరుగంటి మధుసూధన్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి పి.ఘటికాచంల కథ-సంభాషణలు, స్టడీకామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, శ్రీజ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|