బ్రహ్మాజీ 'అబ్బో...వాడా!'
బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా శ్రీ శ్రీ కుమార స్వామి ఫిలిమ్స్ పాతాకంపై ఎస్.బసవపున్నయ్య నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి'అబ్బో...వాడా!' అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రానికి రత్నం కె.వి.దర్శకుడు. ఇంతవరకూ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ లోకి అడుగుపెడుతోంది.
చిత్ర విశేషాలను నిర్మాత బసవపున్నయ్య తెలియజేస్తూ, దర్శకుడు కథను చెప్పినట్టుగానే వైవిధ్యభరితంగా తెరకెక్కిస్తున్నారనీ, మొదటి షెడ్యూల్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, రెండో షెడ్యూల్ దేవరంజాల్ గ్రామంలోనూ చిత్రీకరించామని చెప్పారు. ముడో షెడ్యూల్ కు రెడీ అవుతున్నట్టు చెప్పారు. అభిరుచి గల నిర్మాత లభించడంతో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా తీస్తున్నట్టు దర్శకుడు రత్నం చెప్పారు. నటీనటులంతా కష్టపడి మంచి రిజల్ట్ ఇస్తున్నారని అన్నారు. కుటుంబ కథా నేపథ్యంలో వినోదాత్మక కథనంలో ఈ చిత్రం ఉంటుందనీ, బ్రహ్మాజీ పాత్ర బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. ఇందులో 5 చక్కటి పాటలు ఉన్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రంగనాథ్, రమాప్రభ, రాఘువ, హేమసుందర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కుమారస్వామి సినిమాటోగ్రఫీ, రామారావు కొరియోగ్రఫీ, బల్లేపల్లి మోహన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|