'ఓయ్' ఆడియో విడుదల
సిద్దార్ధ మాట్లాడుతూ, ఇది తనకెంతో ప్రత్యేకమైన రోజనీ, తన గత చిత్రం హైద్రాబాద్ లో ప్రస్తుతం 8 థియేటర్లలో నడుస్తోందని అన్నారు. ఇక నుంచి తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటిస్తానని అన్నారు. 'బొమ్మరిల్లు' సినిమాకు పనిచేసినప్పటి నుంచి ఆనంద్ రంగా తనకు తెలుసునని అన్నారు. తనతో పనిచేసిన దర్శకులలో ప్రభుదేవా తర్వాత ఆనంద్ రంగాను బాగా నమ్మాననీ, అతను ఎలా చెబితే అలా నటించాననీ అన్నారు. భారతదేశం గర్వించదగిన దర్శకులలో ఆనంద్ రంగా ఒకరవుతారని ప్రశంసించారు. ఈ సినిమాకు పాటల అల్బమ్ చేసే బాధ్యతను నిర్మాత తనకు అప్పగించారనీ, అందుకు తగ్గట్టే యువన్ శంకర్ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారనీ చెప్పారు. షామిలితో నటిస్తుంటే జాతీయ అవార్డు కొట్టిన అమ్మాయితో నటించినట్టే భావించానని అన్నారు. ఇందులో నాలుగు పాటలు రాసిన వనమాలికి చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. సిద్దార్ధతో పనిచేయాలనే తన కోరిక ఈ చిత్రంతో తీరిందనీ, దర్శకులు తక్కువ మాటలు చెప్పి ఎక్కువ పనితనం చూపే వ్యక్తిని, సినిమాను బాగా తీర్చిదిద్దారని నిర్మాత దానయ్య తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|