కమల్ 'ఈనాడు'లో లక్ష్మి
సీనియర్ నటి లక్ష్మి, విలక్షణ నటుడు కమల్ హాసన్ గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. అయితే ఈసారి జంటగా కాదు. కమల్ హాసన్ 'ఈనాడు' చిత్రంలో చీఫ్ సెక్రటరీగా ఓ కీలక పాత్రకు లక్ష్మి పోషించనున్నారు. బాలీవుడ్ లో విజయవంతమైన 'ఎ వెడ్నెస్ డే' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెలుగు, తమిళ (ఉన్నిప్పోల్ ఒరువన్) భాషల్లో రూపొందుతోంది. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తమిళ వెర్షన్ లో కమల్ హాసన్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇండర్నేషనల్, యూటీవీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. చక్రి ('సాగరసంగమం'లో చైల్డ్ ఫోటోగ్రాఫర్) దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చిందనీ, జూలైలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయనీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. స్టార్ కాస్ట్ ను దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కూడా చేటుచేసుకున్నాయనీ, విక్టరీ వెంకటేష్ పాత్రలో కూడా తగిన మార్పులు చేశారనీ తెలుస్తోంది. అలాగే హిందీ వెర్షన్ లో చీఫ్ సెక్రటరీ పాత్రకు ఓమోస్తరు ప్రాధాన్యం మాత్రమే ఉందనీ, లక్ష్మి వంటి సీనియర్ నటిని తీసుకోవడం ద్వారా ఆ పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తొలిసారిగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|