నితిన్-ఇలియానా 'రెచ్చిపో'
క్రిస్ప్ గా, వెరైటీగా ఉండే టైటిల్స్ కు ఇవాళ క్రేజ్ పెరిగింది. ఇటీవల వచ్చిన 'కిక్' ఈకోవలేనిదే. ఈ చిత్రంతో ఇలియానా మళ్లీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిరూపించుకున్న తరుణంలో ఆమె ప్రస్తుతం నితిన్ తో నటిస్తున్న చిత్రం విషయంలోనూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరుగుతోంది. నితిన్, ఇలియానా జంటగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ స్పెక్ట్రా మీడియా పతంకాపై జి.వెంకట రమణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. దీనికి 'రెచ్చిపో' అనే టైటిల్ ను తాజాగా ఖరారు చేశారు. తొలుత 'మిర్చి' అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చింది.
లవర్ బాయ్ ఫీచర్స్ ఉండే యాక్షన్ ఓరియెంట్ పాత్రను నితిన్ ఇందులో పోషిస్తుండగా, గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఇలియానా నటిస్తోంది. దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం నితిన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనీ, నితిన్-ఇలియానా తొలిసారి కలిసి నటిస్తుండం విశేషం కాగా, ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కిందని చెప్పారు. తాను గతంలో తీసిన 'నీ స్నేహం', 'పెదబాబు', 'ఆంధ్రుడు' చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందనీ, పూర్తి ఎంటర్ టైన్ మెంట్ ఖాయమనీ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే ఇలియానా కాలికి గాయం కావడంతో కొద్దిపాటి విశ్రాంతి తీసుకుని మళ్లీ షెడ్యూల్ కొనసాగించింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, సునీల్, సుమన్ షెట్టి, రమాప్రభ, హేమ తదితరులు నటిస్తున్నారు. పరుచూరి మురళి కథ-స్క్రీన్ ప్లే సైతం సమకూరుసున్న ఈ చిత్రానికి రమేష్ గోపి మాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|