మమత భుజంపై గణేష్
ఇష్టపడే వ్యక్తుల పేర్లు, ఇమేజ్ లు ఒంటిపై టట్టూగా వేసుకోవడం కొత్త కాదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇదో ఫ్యాషన్ అయింది. కరీనాకపూర్, త్రిష, ముమైత్ ఖాన్ వంటి పలువురు ఇప్పటికే తమకు ఇష్టమైన శరీర భాగలపై టట్టూలు వేయించుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సింగర్ గా, నటిగా టాలీవుడ్ లో తగినంత గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ సైతం ఇప్పుడు పచ్చబొట్ల బెటాలియన్ లో వచ్చి చేరింది. తన అభిరుచికి అనుగుణంగా గణేష్ టట్టూను తన భుజం మీద వేసుకుంది. మమతకు మొదట్నించీ గణేష్, శివుడు అంటే విపరీతమైన భక్తి. ఇప్పుడు గణేష్ టట్టూ వేయించుకోవడం ద్వారా తనకున్న భక్తిని కూడా చాటుకుంది.
'చాలాకాలంగా నా భుజాలపై టట్టూ వేయించుకోవాలనే కోరిక ఉండేది. అయితే ఏ టట్టూ వేసుకోవాలి, ఎలాంటి డిజైన్ ఉండాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయేదాన్ని. చివరకు నా ఫేవరెట్ అయిన గణేష్ టట్టూ వేయుంచుకున్నాను' అంటూ మమత సంబరంగా చెప్పుకొచ్చింది. మరి షూటింగ్ సమయాల్లో టట్టూకు ఎయిర్ బ్రషింగ్ చేయించుకోవాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది కదా అని అడిగినప్పుడు 'ఇష్టమున్న చోట కష్టం ఉండదు. ఆ కష్టాన్ని కూడా గణేష్ కోసం భరిస్తాను' అంటూ సమాధానమిచ్చింది. జపనీస్ లిపిలో మరో టట్టూను కూడా మమత తన వీపు వెనుక భాగంలో వేయించుకుంది.
Be first to comment on this News / Article!
|